CM Chandrababu: మరోసారి తన సొంత జిల్లా.. ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కుప్పం గ్రామీణ మండలం నడుమూరులో పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద ప్రజలకు రాయితీతో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీపై విరుచుకుపడ్డారు.. ఐదేళ్ళుగా గంజాయి రాష్ట్రంగా ఏపీని వైసీపీ మార్చింది.. యువతరాన్ని నాశనం చేసింది.. ఏపీలో గంజాయి లేకుండా చెయడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 150 సేవలు తీసుకుని వస్తున్నాం.. ఇంటి నుండే ప్రతిసేవ పొందేలా చేస్తాం. ప్రపంచంలో వచ్చే ప్రతి మార్పును కుప్పానికి, రాష్ట్రానికి తీసుకుని వస్తాను.. కుప్పానికి రాబోయే రోజుల్నీ మంచి రోజులే అన్నారు. గండికోట నుండి కుప్పంలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తాం అన్నారు.. నేను రాకపోయినా మీరు నన్ను గెలిస్తూ వచ్చారు.. కానీ, ఐదేళ్లుగా కుప్పాన్ని నాశనం చేశారు.. అడ్డదిడ్డంగా దోచుకున్నారు. ఇకపై కుప్పంలో ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Revanth Reddy: మోడీతో కొట్లాడి ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చా
చెడు వ్యక్తులకు సహకరించకండీ.. ఎన్ని తప్పులు చేయాలో అనే తప్పులు చేశారు కాబట్టే 11 సీట్లు వచ్చాయి.. వచ్చేసారికి ఆ సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు సీఎం చంద్రబాబు.. త్వరలో రాజముద్రతో మీ భూమిని మీకు ఇచ్చేలాగా చేస్తాను.. సోలార్ పథకాన్ని, నెట్ జీరో మ్యానెజ్ మెండ్ కార్యక్రమాన్ని కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు.. రాష్ట్రంలో మొదటగా 20 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్ అందిస్తాం.. తొలిగా ఈ పథకాన్ని కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.. నా చిన్నప్పుడు కరెంట్ వస్తే తెగ సంతోషం వేసేది.. భవిష్యత్ లో సోలార్, విండ్ పవర్ వల్ల కరెంట్ చార్జీలు చాలా తగ్గుతాయి అన్నారు. సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే.. ఎన్నో లాభాలు ప్రజలు ఉంటుంది.. ఉచితంగా కరెంట్ రావడంతో పాటు మిగిలింది గ్రిడ్ కు అమ్ముకోవచ్చు అని సూచించారు.. కేన్సర్ సహా పలు జబ్బులకు కారణం రకరకాల కాలుష్యం వల్లే అన్నారు సీఎం చంద్రబాబు.. గ్రీన్ ఎనర్జీ వల్ల జబ్బులు దూరంగా ఉండచ్చు.. వర్షపు నీటినీ భూగర్భజలాలు గా మార్చే ప్రయత్నం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..