Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు నడిపిన పికప్ ట్రక్ బౌద్ధ సన్యాసుల పైకి దూసుకెళ్లడంతో 9 మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రాంతమైన ముక్దహాన్ ప్రావిన్స్ (Mukdahan Province)లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 35 మంది బౌద్ధ సన్యాసులు, ఐదుగురు అనుచరులతో కూడిన బృందం పాదయాత్రలో భాగంగా ఒక ఆలయం నుంచి పొరుగు ప్రావిన్స్ అయిన ఉబోన్ రాచతాని ప్రావిన్స్ (Ubon Ratchathani Province)లోని మరో ఆలయానికి వెళ్తోంది. ఈ యాత్ర ప్రారంభమైన అరగంట తర్వాత ప్రమాదం జరిగింది.
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ప్రమాద సమయంలో పికప్ ట్రక్ ఒక్కసారిగా సన్యాసుల బృందంపైకి దూసుకెళ్లింది. ఘటనాస్థలిలోనే ఐదుగురు సన్యాసులు మృతి చెందగా.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించిన మరో నలుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 22 మంది సన్యాసులు, ఒక అనుచరుడు గాయపడ్డారు. వీరిలో నలుగురు సన్యాసుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలుడు తన ఇంటి వద్ద ఉన్న పికప్ ట్రక్‌ను అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. సుమారు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత సన్యాసుల బృందాన్ని ఢీకొట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం అనంతరం బాలుడు తీవ్ర మానసిక షాక్‌కు గురికావడంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టలేకపోయారు. బాలుడిని అదుపులోకి తీసుకుని బాలల సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో విచారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలో సన్యాసులు రహదారి పక్కన వరుసగా నడుచుకుంటూ వెళ్తుండగా.. పికప్ ట్రక్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
HASSAS İÇERİK | Tayland'daki kazanın farklı bir açıdan görüntüsü ortaya çıktı.https://t.co/uM9bdHIfAI https://t.co/sAubX7keHT
— Haber (@Haber) July 3, 2026
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!