Heavy Rain in Srisailam: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్‌లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట జీపుల్లోనూ స్థానికులు గడపాల్సి వచ్చిందట.. లాలితంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో కె,ఎల్ బ్లాక్ మధ్య నుండి వర్షపు నీటి ప్రవాహం ఉధృతంగా సాగింది.. రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షం ధాటికి బెంబేలెత్తిపోయారు శ్రీశైలం గ్రామస్థులు, భక్తులు, పర్యాటకులు..
Read Also: Siddipet Crime: చేర్యాలలో సైబర్ మోసం.. పోలీసుల పేరుతో 30 వేలు కాజేసిన కేటుగాళ్ళు
మరోవైపు.. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు తెలంగాణ, ఆంధ్రని కలిపే రహదారిపై పడ్డాయి జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చరియలు రాత్రి సమయానికి విరిగి పడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చరియల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణ సమయంలో నీటి తుంపర్లు పడడంతో గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలానే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారుజ ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో కొండ్ల చరియలు విరిగి పడి ట్రాఫిక్ జామ్ అయిన సంఘటనలు లేకపోలేదు. అయిన శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.