పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సమయం రానేవచ్చింది.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది..
పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనషించాలని ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు పృథ్వీరాజ్ రాముడు అనే యువకుడు.. కానీ, గుర్రం పరుగులు తీయడం.. అదుపుతప్పి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది.. మదనపల్లెలోని నవోదయ కాలనీలో అర్ధరాత్రి వీరంగం సృష్టించిందట ఓ గ్యాంగ్.. అయితే వారిని వారించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కాల్పులు జరపడం సంచలంగా మారింది.
విశాఖలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు విలువైన 25 వేల కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు పురోగతి పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలని పొలిటికల్ డిమాండ్ ఊపందుకుంది. 2024 మార్చి 19న సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజులు ముందు... ఏపీ రాజకీయాలను దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ.. సీబీఐ బాంబు పేల్చింది. విశాఖపట్నం పోర్టుకు నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ…
ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఆయా ప్రభుత్వాలు.. దీనిపై విపక్షాలు కొన్ని విమర్శలు చేసినా.. ఉచిత బస్సు ప్రయాణంతో.. బస్సుల్లో మహిళల రద్దీ మాత్రం పెరిగిపోయింది.. ఇక, ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వైపు అడుగులు పడుతున్నాయి.. దీనిపై ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.