ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ రోజు మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సమీక్షించనున్న ఆయన.. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు.. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఆరా తీయనున్న ఏపీ సీఎం.. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేయనున్నారు.
జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది.. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో బాలరాజు కారు అద్దం ధ్వంసమైంది.. ఈ అయితే, ఈఘటనను తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
పిఠాపురం నియోజకవర్గంలో.. వైసీపీకి భారీ షాక్ తగలబోతోందట.. వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఉన్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.. దీనిపై తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారట పెండెం దొరబాబు.
గత ప్రభుత్వంలో ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ అక్రమాలపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. 2019-24 మధ్య కాలంలో ఏవియేషన్ కార్పొరేషన్ లావాదేవీలపై ఆరా తీస్తోంది.. అప్పటి ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీ భరత్ రెడ్డి అక్రమాలపై త్వరలో విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు..
వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.. టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓ విజ్ఞప్తి చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. నేను ఒక కామన్ మెన్‌గా దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా.. 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.. చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి అంటూ వ్యాఖ్యానించారు.