AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..
- నేడు ఏపీ కేబినెట్ సమావేశం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ..
- మరోసారి పేపర్ లెస్ విధానం..
- ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనున్న ఏపీ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఏపీ సర్కార్ మరోసారి పేపర్ లెస్ విధానాన్ని అవలంభిస్తోంది.. ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ ఇవాళ్టి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకు అంతా ఆన్ లైన్ ద్వారానే మంత్రులకు ప్రభుత్వం అందజేయనుంది. ఈ-కేబినెట్ నిర్వహణపై మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలను జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ వివరించారు. కేబినెట్ ప్రారంభం కాగానే ఈ-కేబినెట్ విధానం అమలుపై మంత్రులకు డెమో ఇవ్వనున్నారు ఎన్ఐసీ అధికారులు.
Read Also: Vishnu Stotram: ఈ స్తోత్రాలు వింటే ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుంది..
Also Read
- Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
- Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
- Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
ఇక, ఈ కేబినెట్ సమావేశంలో కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణపై కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండీయూ వాహానాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది… ఏపీ విజన్ డాక్యుమెంట్-2047పై మంత్రివర్గంలో చర్చ సాగనుండగా.. ఇసుక విధానం అమలు తీరుపై కేబినెట్ సమీక్షించనుంది.. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణలపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..