Kadapa MLA vs Mayor: కడపలో తారస్థాయికి చెత్త వివాదం.. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే..! ఉద్రిక్తత
- కడపలో చెత్త వివాదం తారస్థాయికి..
- కడప ఎమ్మెల్యే మాధవి.. మేయర్ సురేష్ బాబుల మధ్య మాటల యుద్ధం..
- నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన ఆందోళన..
- మేయరం నివాసం ఎదుట చెత్తపారబోసిన టీడీపీ శ్రేణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa MLA vs Mayor: కడపలో చెత్త వివాదం తారస్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవి, కడప మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ వీధులలో చెత్త ఎత్తలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెత్తను తీసుకుని వచ్చి మేయర్ ఇంటి వద్ద వేసి నిరసనకు దిగారు. దీనికి ప్రతీకారంగా వైసీపీ నేతలు చెత్తను ప్రథమ పౌరుని ఇంటి వద్ద ఎలా వేస్తారు..? అంటూ వాదనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల రంగ ప్రవేశంతో ఇరు వర్గాలను చదరగొట్టారు.
Read Also: Sri Lankan Navy: 8 మంది తమిళనాడు జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్‌కు నివాళి
ఇక, కడప మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు వైసీపీ కార్యకర్తలు… మేయర్ ఇంటి వద్ద చెత్త వేసిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.. కడప ఎమ్మెల్యే మాధవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అప్పుడే ఇంటికి చేరుకున్నారు మేయర్ సురేష్ బాబు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చి మూడు నెలలు కాలేదు, అప్పుడే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు.. టీడీపీ నేతలు ఇంటి వద్దకు వచ్చి ఇంత అరాచకం చేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు..? అని మండిపడ్డారు.. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ క్లాప్స్ ప్రోగ్రాంని ఎత్తివేశారు.. 570 మంది సిబ్బందితో నిత్యం చెత్త ఏరి వేస్తున్నాం అని వెల్లడించారు.. తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం పందికొక్కులు మాత్రమే నా ఇంటి వద్ద చెత్తవేశాయి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న కడపను టిడిపి అధికారంలోకి రాగానే అల్లర్లు సృష్టిస్తున్నారు.. నా ఇల్లు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉంది.. పోలీసులకు తెలియకుండా నా ఇంటి వద్ద చెత్త వేశారా? అని నిలదీశారు.. అంతేకాదు.. మేం అనుకుంటే మీ ఇల్లు వద్ద కూకటి వేళ్లతో తొలగించగలం… కానీ, మా నాయకుని ఆదేశాల మేరకే మేం శాంతియుతంగా ఉన్నాం అన్నారు మేయర్ సురేష్ బాబు..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!