డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యారు యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్.. మంగళగిరిలోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ రోజు ఉదయం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌కు అభినందనలు తెలియచేసి.. జ్ఞాపిక అందచేశారు యూఎస్ కాన్సల్ జనరల్.. ఇక ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ టీమ్‌ను సత్కరించారు పవన్.
గిరిజన సంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు స్వయంగా వివరించారు అధికారులు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం.. టీటీడీ అంటే భక్తుల నుంచి విరాళాలు సేకరించడం అని కాకూండా.. భక్తులకు మెరుగైన సేవలందించడంపై దృష్టి సారించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ప్రొరోగ్ చేశారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.. ఇక, అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది..
మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు.. ఏపీకి ప్యాకేజ్ లభిస్తే తెలంగాణ ప్రభుత్వం వైఖరి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనంగా ఉందన్న ఆయన.. కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటోంది..? అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదు అని విమర్శించారు
శ్రీశైలం జలాశయం 5 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.. ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోన్న నేపథ్యంలో.. జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు..
పింఛన్ల లబ్ధిదారులకు ఒక్కరోజులోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్ విడుదల చేసింది ఏపీ సర్కార్.. పెన్షన్ల పంపిణీపై మార్గదర్శకాలను విడుదల చేసింది గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం..