శ్రీశైలం డ్యామ్ క్రమంగా వరద పోటెత్తుతోంది.. ఓవైపు కృష్ణా రివర్.. మరోవైపు తుంగభద్ర నది నుంచి భారీ ఎత్తున వరద వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతోంది.. దీంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో గంటకు ఒక టీఎంసీ చొప్పున నీటిమట్టం పెరుగుతోంది..
కేంద్రం నుంచి ఏపీకి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి మురుగన్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్థంతి సందర్భంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ సారాంశాన్ని, ఏపీకి చేసిన లబ్ధిని వివరించారు.. కేంద్ర, రాష్ట్రాల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో అద్భుతమైన విజయం సాధించాం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పడిన బడ్జెట్ రూపకల్పన చేశాం అన్నారు..
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలంలోని నారమాకులపల్లిలో దారుణం చోటుచేసుకుంది.. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నారమాకుల పల్లికి చెందిన చెందిన ఆరేటి నీలావతి అనే మహిళను అల్లుడు విజయ్ కుమార్ దారుణంగా కర్రతో బాది చంపిన ఘటన చోటు చేసుకుంది..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది.. ఆ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు