ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు.
ఆన్లైన్ ఫుడ్ అనగానే ఎక్కువగా నాన్‌వెజ్ వైపే మొగ్గుచూపుతారని అనుకుంటాం.. కానీ, వెజ్‌కు కూడా మంచి డిమాండే ఉంది.. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే.. ముక్కలేనిది ముద్ద దిగదు అనే మాట వినిపడుతుంది.. అలాంటిది.. వెజ్ ఫుడ్ ఆర్డర్లలో టాప్ 3లో నిలిచింది మన మహానగరం
మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది జియో.. జియో భారత్ జే1 4జీ పేరుతో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇది 4జీ కనెక్టివిటీతో దేశీయ మార్కెట్లో ప్రవేశ పెట్టిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్.. జియో భారత్ ప్లాన్‌కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ అందిస్తోంది జియో..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలకపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేశారు.. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపెట్టారు.. అయితే, మద్యం స్కాంలో ప్రభుత్వం దృష్టికి సంచలన వాస్తవాలు వస్తున్నాయట.. మద్యం శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలకంటే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయట..