CM Chandrababu: సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, కేబినెట్ భేటీ తర్వాత కీలక శాఖలపై దృష్టి సారించనున్నారు సీఎం చంద్రబాబు.. సెర్ప్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖపై దృష్టిపెట్టనున్నారు.. సెర్ప్, MSME శాఖలపై సమీక్షించనున్నారు చంద్రబాబు. MSME కొత్త పాలసీ, MSME పార్కుల ఏర్పాటుపై చర్చించనున్నారు. NRI ఎంపవర్మెంట్‌పై చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు.. ఏపీ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సేవలను ఏ విధంగా వివియోగించుకోవచ్చు అనే అంశంపై చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. జనవరి నుంచి ప్రారంభం కాబోయే జన్మభూమి 2.0లో ప్రవాసాంధ్రులను భాగస్వాములు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. P-4 విధానం అమల్లో ప్రవాసాంధ్రుల పాత్రపై చర్చించే అవకాశం కూడా ఉందంటున్నారు అధికారులు..
Read Also: DY Chandrachud: నేను సీజేఐ చంద్రచూడ్‌ని, రూ. 500 పంపండి.. ప్రధాన న్యాయమూర్తి పేరుతో మెసేజ్లు..!
ఇక, ఈ రోజు జరగనున్ఈన కేబినెట్ సమావేశంలో కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. సెబ్ రద్దుపై మంత్రివర్గంలో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా.. ఎక్సైజ్ కొత్త పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు మంత్రులు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణపై కేబినెట్‌లో చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. రేషన్ బియ్యం సరఫరా చేసే ఎండీయూ వాహానాలను రద్దు చేసే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది… ఏపీ విజన్ డాక్యుమెంట్-2047పై మంత్రివర్గంలో చర్చ సాగనుండగా.. ఇసుక విధానం అమలు తీరుపై కేబినెట్ సమీక్షించనుంది.. గత ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై విచారణలపై మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.