Srisailam Dam: శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు..
- శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి..
- మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్న అధికారులు..
- కాసేపట్లో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లో వచ్చి చేరుతుంది.. అయితే, కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడంతో.. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో రూపంలో 68,876 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 215.8070 టీఎంసీలుగా ఉంది..
Read Also: Para Olympics 2024: నేటి నుంచి పారాలింపిక్స్.. భారత్ తరపున బరిలోకి 84 మంది అథ్లెట్లు
Also Read
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
మరోవైపు.. శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది.. 2 గేట్లు 10 అడుగుల మేర పైకి ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 78,854 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 78,854 క్యూసెక్కులుగా ఉంది.. ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరింది.. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉండగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 .0450 టీఎంసీలు.. అయితే, నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని 2 గేట్లను ఎత్తి నిన్నటి నుంచే దిగువకు నీటిని వదులుతున్నారు అధికారు.. శ్రీశైలంలో కాసేపట్లో మళ్లీ గేట్స్ ఓపెన్ చేయబోతున్న నేపథ్యంలో.. ఇన్‌ఫ్లో పెరిగితే.. నాగార్జున సాగర్ లో మరికొన్ని గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారు అధికారులు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!