MP Mopidevi Venkata Ramana: వైసీపీకి మరో బిగ్‌షాక్..? రాజీనామాకు సిద్ధమైన ఎంపీ..!
- వైసీపీకి మరో బిగ్ షాక్..!
- వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ..
- రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారం..
- ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా.. బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి..
- త్వరలో టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mopidevi Venkata Ramana: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే పలువురు కీలక నేతలు, మాజీ మంత్రులు పార్టీకి దూరంగా జరిగారు.. కొందరు పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తు్న్నారు.. మరోవైపు.. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు.. కార్పొరేటర్లు.. కౌన్సిలర్లు.. ఇలా ఇప్పటికే చాలా మంది టీడీపీ కండువా కప్పుకున్నారు.. అయితే, ఇప్పుడు వైసీపీకి బిగ్ షాక్ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. దీనిపై రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
Read Also: PM Modi’s US Tour: న్యూయార్క్‌లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్.. భారీ స్పందన
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో తన ఎంపీ పదవికి రాజీనామాచేసిన అనంతరం, రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశం పెట్టి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ ప్రకటించే అవకాశం ఉందట.. అంతేకాదు.. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీసీలె చేరే అవకాశం ఉందంటున్నారు.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న మోపిదేవి వెంకటరమణ.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తిరిగి వస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మోపిదేవికి ఓటమి తప్పలేదు.. అయినా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఆయనకు ప్రాధాన్యత కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. తన తొలి కేబినెట్‌లో మోపిదేవికి మంత్రి పదవి కట్టబెట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి.. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపించిన విషయం విదితమే.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగాను.. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మోపిదేవి.. ఆ పార్టీకి గుడ్‌బై చెబితే.. వైసీపీకి భారీ షాక్ తగిలినట్టే అవుతుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!