సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజులు అన్ని మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు.. భ్రమరాంభ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్నా.. శ్రీశైలం జలాశయం జులై నెలలో నిండింది.. రాయలసీమలో కరువు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అన్నారు. కృష్ణా మిగులు జలాలని మనం వాడుకోవచ్చని చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్అని గుర్తుచేసిన ఆయన.. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే చెన్నై కి నీళ్లు వెళ్తాయని చెప్పిన నాయకుడు చంద్రబాబు అన్నారు. రాయలసీమలో…
ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి, గుంటూరు కలెక్టర్.. నాగలక్ష్మి, జీఏడీ అధికారులు హాజరు కాగా.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పెషల్ సీఎస్ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.. నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల పర్యటనలో భాగంగా మొదట శ్రీశైలం చేరుకున్న ఏపీ సీఎంకు.. సున్నిపెంటలోని హెలిప్యాడ్ దగ్గర మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఆ తర్వాత రోడ్డు మార్గాన శ్రీశైలం మల్లన్న ఆలయనాకి చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయన స్వాగతం…
ఆంధ్రప్రదేశ్లో మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం సృష్టించింది.. అయితే, ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనను సీఐడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం..
గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడమే కాకుండా.. అప్పులు చేసి పెట్టింది.. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అప్పులే కనిపిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..
శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది.