Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బెజవాడ వన్ టౌన్ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. అయితే, ఈ ఘటనపై విచారణ జరపాలని ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు శుక్రవారం ఫిర్యాదు చేశారు.. ఇక, ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. 336 ర్యాష్ అండ్ నెగ్లిజన్స్ యాక్ట్, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సేక్షన్లతో కేసు నమోదు చేశారు. గేట్లను ఢీకొన్న బోట్ల వివరాలను.. యజమానుల వివరాలు, కారణాలు విచారణ చేయాలని ఫిర్యాదు చేసింది ప్రభుత్వం.. 5 బోట్లు ఢీ కొనడంతో బ్యారేజ్ 69వ ఖానా దగ్గర డ్యామేజ్ అవడంతో కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం..
Read Also: Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు పవన్ కల్యాణ్ ప్రశంసలు
అయితే, ఉద్దేశపూర్వకంగా బోట్లు వదిలి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టేలా చేశారంటూ మంత్రులు ఆరోపిస్తున్నారు.. ఈ క్రమంలో బ్యారేజీని ఢీకొన్న బోట్లు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరులకు చెందిన బోట్స్‌గా అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం విదితమే కాగా.. మూడు బోట్స్‌కు కలిపి ఒకే గొలుసు వేసి కట్టడంతోనే ఒకే చోటకి వచ్చి ఢీకొన్నాయని అంటున్నారు.. దీంతో.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. మరోవైపు.. ప్రకాశం బ్యారేజీ బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్ర కోణం ఉందంటూ మంత్రి కొల్లు రవ్రీంద్రతో పాటు.. తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే..