YSRCP: చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు.. మాజీ మంత్రికి కీలక బాధ్యలు..!
- చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు..!
- మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్..
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజారిన తర్వాత.. కొందరు కీలక నేతలు సైతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరికొందరు కీలక స్థానాల్లో ఉన్న నేతలు సైతం.. అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.. దీంతో.. అలర్ట్ అవుతున్నారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినవారు.. తన నమ్మకస్తులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.. అందులో భాగంగా.. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించేందుకు వైఎస్ జగన్ పూనుకున్నట్టుగా తెలుస్తోంది.. త్వరలో చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని మారుస్తారని తెలుస్తోంది.. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ ను కుప్పం నియోజకవర్గానికే పరిమితం చేయాలనేది అధిష్టానం ఆలోచనగా ఉందట..
Read Also: Terrorist Arrested: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాది సహాయకుడి అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. కలసి కట్టుగా పార్టీనీ బలోపేతం చేయాలని, సమస్యలు వస్తే అందరూ కలసి వెళ్లాలని గురువారం జరిగిన చిత్తూరు జిల్లా వైసీపీ నేతలను సూచించారు పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఈ సమావేశంలోనే అధ్యక్షుడు మార్పు.. కొత్త అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్పు చేసిన జగన్.. ఇప్పుడు చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో పరిస్థితుల పైన ఆరా తీసిన ఆయన.. ఇదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై నేతల నుంచి అభిప్రాయం సేకరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించాలని డిసైడ్ అయ్యారట.. చిత్తూరు జిల్లాలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బాధ్యతలు తీసుకోవాలని పెద్దిరెడ్డికి సూచించారట వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!