Vande Bharat: విశాఖకు “వందేభారత్” రైళ్లు క్యూ కడుతున్నాయి. ఎల్లుండి నుంచి మరో కొత్త సర్వీసు ప్రారంభంకాబోతోంది.. భారతీయ రైల్వేలలో వాల్టేర్ డివిజన్ ది ప్రత్యేక స్థానం. విశాఖ జంక్షన్ మీదుగా రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష దాటుతుంది. అదే సెలవులు, పర్వదినాల్లో అయితే ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు. అయితే, డిమాండ్ కు అనుగుణంగా రైళ్ల ఫ్రీక్వెన్ని వుండటం లేదనే విమర్శలు బలంగా వుండేవి. కానీ, వందేభారత్ ఎంట్రీ తర్వాత విశాఖ రైలు ప్రయాణీకులకు వెసులుబాటు లభించింది… వివిధ గమ్యస్థానాలకు వెళ్లే సెమీ హైస్పీడ్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో వైజాగ్ నిలబడింది.
Read Also: Jonty Rhodes: నేను లోకల్, నాది గోవా.. జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈనెల 16న రెండు కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒకటి సికింద్రాబాద్ -నాగ్‌పూర్ మధ్య కాగా మరొకటి విశాఖ- దుర్గ్ జంక్షన్ మధ్య పరుగులు పెట్టనున్నాయి. వందే భారత్ నెట్‌వర్క్ విస్తరిస్తుండగా కొత్త సర్వీసులు రాకతో హైదరాబాద్‌కు ఐదు, విశాఖకు నాలుగుకు పెరిగినట్టు అవుతుంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ కు రెండు.. భువనేశ్వర్ కు ఒకటి రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్త వందేభారత్ సేవలు ప్రారంభం అయితే నాలుగు రాజధాని నగరాలను కనెక్ట్ చేస్తూ నెట్‌వర్క్ విస్తరించినట్టు అవుతుంది. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ సిటీ దుర్గ్‌కు వెళ్లే వందేభారత్.. ఆ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ మీదుగా ప్రయాణిస్తుంది. ఒడిశా కేపిటల్ భువనేశ్వర్, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు ఇప్పటికే రెండు రైళ్లు ఉ న్నాయి.. సికింద్రాబాద్ వెళ్లే క్రమంలో విజయవాడ జంక్షన్ టచ్ చేస్తుండగా మొత్తం నాలుగు విశాఖ నుంచి.. నాలుగు రాష్ట్రాలను కలుపుతూ వందేభారత్ నెట్‌వర్క్ విస్తరించింది. ఈ స్ధాయిలో విశాఖకు ప్రాధాన్యత లభించడానికి విద్య, వైద్య, పారిశ్రామిక హబ్ కావడమేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Christina Joksimovich : మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య
కాస్మోపాలిటిన్ హంగులతో కనిపించే విశాఖ నగరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తుంటారు. ప్రధానంగా ఉత్తరాధి రాష్ట్రాల సంఖ్య ఎక్కువ. వీరందరికీ సౌలభ్యంగా వుండటంతో పా టు విశాఖకు పెరుగుతున్న ప్రాధాన్యత కూడా వందేభారత్ కేటాయింపులకు కారణం కానుంది. ఉత్త రాధి రాష్ట్రాలకు వెళ్ళే ప్రయాణీకుల నుంచి విశాఖ-దుర్గ్ వందేభారత్ కు మంచి ఆదరణ లభిస్తుందని వాల్టేర్ డివిజన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన మూడు వందే భారత్ రైళ్లలో విశాఖ-సికింద్రాబాద్ సర్వీసులు 100 శాతం ఆక్యూపెన్సీతో నడుస్తున్నాయి. అదే భువనేశ్వర్ అయితే 80 శాతం ప్రయాణికులతో వెళ్తుంది.. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువే అయిన సరే ఆదరణ లభిస్తోంది. ఆత్యాధునిక టెక్నాలజీతో పాటు అనేక సౌకర్యాలు వుండటం ప్రయాణికుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో వందేభారత్ రైళ్లను అందుబాటులోకి వచ్చే అవకాశాలు వున్నాయి..