Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏ పేరుతో ఫోన్ చేసి.. ఎలా ట్రాప్ చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు ఏ కంగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు పేరు మీద.. అతడికి తెలియకుండానే పెద్ద మొత్తంలో లోన్ తీసుకున్నారు కేటుగాళ్లు.. తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రూప్ కుమార్‌కు తెలియకుండా.. అతడి పేరు మీద ఏకుండా రూ.13.8 లక్షలు లోన్ కాజేశారు సైబర్ నేరగాళ్లు..
Read Also: Raghava Lawrence : ఆ సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయబోతున్న రాఘవ లారెన్స్..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యానగర్ కు చెందిన రూప్ కుమార్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.. ఈ నెల 5వ తేదీ రూప్ కుమార్‌కు ఓ ఫోన్ వచ్చింది.. ముంబైకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులమంటూ రూప్ కుమార్‌కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఇరాన్ కు ఇల్లీగల్ వస్తువులు సరఫరా చేశారంటూ బెదిరించారు.. విచారణ కోసం ముంబైకు రావాలని రూప్ కుమార్‌ను ఆదేశించారు.. లేకపోతే స్కైప్ యాప్‌లో మాట్లాడాలని బెదిరింపులకు దిగారు.. దీంతో బెదిరిపోయిన రూప్ కుమార్.. వాళ్లు ఏది చెబితే అది చేస్తూ పోయాడు. చివరకు రూప్ కుమార్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు ఇలా వాళ్లకు కావాల్సిన అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ వివరాలతో బాధితుడికి తెలియకుండానే లోన్ తీశారు.. ఆ మొత్తాన్ని అతడికి తెలియకుండానే కాజేశారు సైబర్ కేటుగాళ్లు.. అయితే, లోన్ తీసుకున్నట్లు బ్యాంకు నుంచి ఫోన్ రావడంతో మోసపోయానని తెలుసుకున్న రూప్ కుమార్.. ఆ తర్వాత ఎస్పీ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశాడు.. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..