AP Crime: కుక్కలు మొరగగానే కొందరు ఆగి వాటిని ఆదిమించే ప్రయత్నం చేస్తారు.. ఇంకా కొందరు భయంతో పరుగులు తీస్తారు.. దీంతో.. అవి వారి వెంట పడి మరీ.. పిక్కలు పీకేస్తాయి.. అయితే, ఓ యువకుడికి కుక్కలు చేదుఅనుభవాన్ని మిగిల్చాయి.. మొరిగింది కుక్కలే.. కానీ, భయంతో పరుగులు తీస్తే.. స్థానికులు పట్టుకుని తాట తీశారు.. కుక్కల నుంచి తప్పించుకున్నాడు.. కానీ, తెలుగు రాకపోవడంతో.. అతడిని దొంగగా భావించి కట్టేసి కొట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది..
Read Also: Gold Rate Today: వరుసగా మూడోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంతుందంటే?
శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుక్కులు మొరగడం .. అతడి వెంట పడడం.. దానికితోడు హిందీ మాట్లాడుతుండంతో.. యువకుడిని దొంగగా భావించి గ్రామస్థులు పట్టుకుని కట్టేసిన ఘటన సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో చోటు చేసుకుంది.. గ్రామానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టిన తరువాత అసలు విషయం వెలుగుచూసింది. యువకుడు కూలీ అని, తన బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు వెంట పడ్డాయని తెలిపారు. యువకుడు పరుగులు పెట్టడంతో గ్రామస్థులు దొంగ అనుకున్నారని కట్టేశారని పోలీసులు తెలిపారు. కుక్కలు నుంచి తప్పించుకున్నాడు.. కానీ, భాష రాకపోవడంతో.. స్థానికులకు అనుమానం రావడంతో.. కట్టేసి కొట్టడం కలకలం సృష్టించింది.