AP Crime: అన్నంత పని చేసింది..! వారం రోజుల శిశువును అమ్మేసిన తల్లి..
- అనంతపురం జిల్లాలో దారుణం..
- మానవత్వం మంట గలిపిన తల్లి..
- వారం రోజుల శిశువును విక్రయించిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: మానవత్వం మంట గలిపి మానవ సంబంధాలకు విలువలు లేకుండా సభ్యసమాజంలో చివరకు శిశువును సైతం విక్రయించే దారుణానికి ఒడిగట్టారు. దత్తత పేరుతో శిశువును కొనుగోలు చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన బళ్లారి రూపమ్మకు 15 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. ఆమెకు అంతకు ముందు ఆరేళ్ల బాలిక కూడా ఉంది. కుటుంబ కలహాలతో భర్తతో కాకుండా రాయదుర్గంలో ఒంటరిగా జీవిస్తుంది. ఈమె గర్భవతిగా ఉన్నపుడే ఆమె రాయదుర్గం పట్టణ శివారులో ఒంటరిగా ఉండేది. అప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆమె ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సలు అందించారు.
Read Also: Srilanka : ప్రశాంతంగా కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికల పోలింగ్
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
అయితే, అప్పటి నుంచి తనకు పుట్టే సంతానాన్ని అమ్మేస్తానంటూ చెబుతూ వచ్చేది. దీంతో ఆమె బంధువులకు, కుటుంబీకులకు సమాచారం అం దించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసవించేదాకా పర్యవేక్షిస్తూ వచ్చారు. అంతిమంగా మగశిశువును 15 రోజుల క్రితం జన్మనిచ్చింది. కాగా ఆమెకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆమె జన్మనిచ్చిన మగశిశువు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఆమె ఉన్న ఇంటి వద్దకు వెళ్లి శిశువు గురించి ఆమెను ఆరా తీశారు. కానీ వారం క్రితమే ఆమె శిశువును రూ. 80 వేలకు ఆమె విక్రయించేసినట్లు వెల్లడించింది. దీనిపై అప్రమత్తమైన సిబ్బంది పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా, రాయదుర్గం పట్టణానికి చెందిన ఎరుకుల రాజశేఖర్‌కు దత్తత ఇచ్చినట్లు పత్రాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించి శిశువును ఎక్కడ ఉంచారన్న విషయంపై గాలించాలని కోరడంతో రాజశేఖర్‌ను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. అతని సమీప బంధువులకు సంతానం లేకపోవడంతో వారి వద్ద ఉన్నట్లు తెలిపారు. శిశువును వెంటనే స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించడంతో హుటాహుటిన తీసుకొచ్చి ఐసీడీఎస్ సీడీపీవో పద్మావతికి అప్పగించారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిపై వైద్యశాలలో పరీక్షలు చేయించి స్వాధీనం చేసుకున్నారు. శిశువును నేరుగా దత్తత ఇవ్వడం కుదరదని తల్లి రూపమ్మకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని తన తదనంతరం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే కారణంతో వారికి అప్పగించినట్లు ఆమె చెప్పింది. సంతృప్తి చెందని అధికారులు ఆమె ప్రవర్తనపై తీవ్ర అనుమానాలు ఉండడంతో శిశువును శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించారు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!