తన నియోజకవర్గంలోని ఆడపడుచుల మనసులు గెలుచుకునేందుకు ఏపీ డిప్యూటీ సీఎం.. శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అయిన ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు.. ఈ సందర్భంగా.. 12 వేల చీరలను పిఠాపురంలోని ఆడపడుచులకు పంపించారు పవన్ కల్యాణ్..
ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నరసరావుపేట JNTU కాలేజీలో వన మహోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొక్కలు నాటనున్నారు. తర్వాత జేఎన్టీయూ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది.. రాజ్యసభ సభ్యత్వానికి ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేశారు. ఢిల్లీలో ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు కలిసి రాజీనామా లేఖలు సమర్పించారు ఇరువురు నేతలు.. అంతేకాదు.. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. అంతేకాదు.. వారి అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయి..
కొల్లం గంగిరెడ్డి వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు.
ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ సీరియస్ అయ్యింది.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. జిత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది.
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని రైతులకు పెండింగ్ లో ఉన్న కౌలు నిధులను విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది.. ఈ విషయాన్ని మంత్రి నారాయణ వెల్లడించారు.. పెండింగ్లో ఉన్న కౌలు నిధులను త్వరలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు నారాయణ..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజీనామాకు ముందు ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయ.. రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయిందని.. అధికారం లేదని పార్టీ వీడటం లేదు అని స్పష్టం చేశారు.. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో.. నాకు ఉన్న ఇబ్బందులు, సమస్యలతో వైఎస్ఆర్సీపీ వీడాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు.