Tirumala: శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం..
- శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం..
- ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి యాగం..
- శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం..
- యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం శాస్రోక్తంగా ప్రారంభమైంది. లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో.. అందుకు అనుగుణంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నారు అర్చకులు. శ్రీవారికి ఉదయం నైవేద్య సమర్పణ జరిగిన అనంతరం బంగారు వాకిలి సమీపంలో ఉన్న యాగశాలలో మూడు యజ్ఞ కుండాలలో మహా శాంతి యాగ క్రతువు ప్రారంభించారు అర్చకులు. ముందుగా పుణ్యా వచన కార్యక్రమాన్ని నిర్వహించి అటు తరువాత మహా శాంతి యాగాన్ని ప్రారంభించారు. చివరగా వాస్తు హోమం నిర్వహించి అనంతరం పంచగవ్య పదార్థాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో అన్నప్రసాద పోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేయడంతో మహా శాంతి యాగం ముగియనుంది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమపండితులుతో పాటు ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
Read Also: Ravichandran Ashwin: ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు: అశ్విన్
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
కాగా, తిరుమల లడ్డూ కల్తీ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ తో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది.. దీనిపై రాజకీయ దుమారం కూడా చెలరేగింది.. అధికార కూటమి నేతలు.. వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది.. దీనిపై వివిధ మఠాధిపతులు కూడా స్పందిస్తున్న విషయం విదితమే.. ఇక, ఈ నేపథ్యంలో మహా శాంతి యాగాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో.. శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగాన్ని నిర్వహిస్తోంది టీటీడీ..
తాజావార్తలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!