Anantapur: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి నిర్వాకం.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. మూత్రనాళం తొలగింపు..!
- ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి నిర్వాకం..
- గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే మూత్రనాళం తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి నిర్వాకం కలకలం సృష్టిస్తోంది.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. ఏ కంగా మూత్రనాళం తొలగించాడు వైద్యుడు.. అయితే, మూత్రం రాకపోవడంతో.. ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి చేరిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళ్తే.. కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మ అనే మహిళ అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది.. గర్భసంచిలో సమస్య ఉందని… తన ప్రైవేటు ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తానని సూచించాడు ప్రభుత్వ డాక్టర్ రమణ నాయక్..
Read Also: Case File: ముగ్గురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు..
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
దీంతో.. ఈ నెల 9వ తేదీన రమణ నాయక్ కు చెందిన లావణ్య ఆసుపత్రిలో రాధమ్మకు ఆపరేషన్ చేశారు.. అదేరోజు డిశ్చార్జ్ కూడా చేశారు.. అయితే, డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులకు కూడా మూత్రం రాకపోవడంతో తిరిగి రమణ నాయక్ ఆసుపత్రికి వచ్చింది బాధితురాలు రాధమ్మ .. తప్పు జరిగిందని తెలుసుకుని.. అసలు విషయం చెప్పకుండా.. బాధితురాలు రాధమ్మను వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించిన వైద్యుడు.. వేరే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాక.. రెండు రోజులుగా మూత్రం రాక.. కిడ్నీ వాపుతో బాధపడుతున్న రాధమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది.. గర్భసంచి ఆపరేషన్ కు బదులు.. మూత్ర నాళం తొలగించారన్న విషయం బయటపడింది.. దీంతో బాధితురాలి బంధువులు లావణ్య హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు.. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ రమణ నాయక్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..