Ram Temple Chariot Burning Case: రాముడి గుడి రథం దహనం కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు..
- రథం దహనం కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు..
- కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో ఘటన..
- శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి నిప్పు పెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు..
- వివరాలు మీడియాకు వెల్లడించిన ఎస్పీ జగదీష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Temple Chariot Burning Case: అనంతపురం జిల్లాలో రథం దహనం కేసు సంచలనం సృష్టించిన విషయం విదితమే కాగా.. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు.. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో నిన్న శ్రీరాముడి గుడికి సంబంధించిన రథానికి నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అదే గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బొడిమల్ల ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ని అరెస్టు చేశారు. సొంత ఖర్చులతో రామాంజనేయ రెడ్డి అనే వ్యక్తి శ్రీరాముని రథం చేయించారని.. ఆయనకు మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఈశ్వర్ రెడ్డి, ఆయన అనుచరులు రథానికి నిప్పు పెట్టారని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ మీడియాకు వెల్లడించారు.
Read Also: Devara Ticket Prices: ‘దేవర’ టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్!
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
అయితే, రామాలయంలో రథం దగ్ధం కేసును సీరియస్‌గా తీసుకుంది ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణ జరపాలని.. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు.. జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో ఒకే రోజులో శ్రీరామాలయంలో రథం దహనం కేసును చేధించారు పోలీసులు.. రథం దగ్ధం ఘటనపై మీడియాతో మాట్లాడిన ఎస్పీ జగదీష్.. కనేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రథం దగ్ధం కేసులో ఒకరిని అరెస్టు చేవామని తెలిపారు.. ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ నాయకుడు పెట్రోల్ పోసి.. రథానికి నిప్పటించారని వెల్లడించాఉ.. హనకనహాల్ గ్రామస్తుడు ఎర్రిస్వామి రెడ్డి, అతని అన్నదమ్ములు దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రథాన్ని తయారు చేశారు.. ఎర్రిస్వామి రెడ్డి సొంత కుటుంబ సభ్యులు.. చందాలు తీసుకోకుండా సొంతంగా రథాన్ని తయారు చేయడంతో గ్రామంలోని మిగిలిన వారితో విభేదాలు ఏర్పడ్డాయి.. ఈ నేపథ్యంలోనే ఈశ్వర్ రెడ్డి మొన్న అర్ధరాత్రి తన బైక్ లో పెట్రోల్ తీసి రథానికి నిప్పంటించాడు.. ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని విచారించాం.. రథం దగ్ధం వెనుక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామని తెలిపారు.. ఈశ్వర్ రెడ్డిని కస్టడీకీ తీసుకొని రథం దగ్ధం కేసులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అని విచారిస్తాం అన్నారు ఎస్పీ జగదీష్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?