CM Chandrababu Delhi Tour: హస్తినలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. నేడు కీలక భేటీలు
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీ..
- నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ..
- అమిత్ షా.. నిర్మలా సీతారామన్ తో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Delhi Tour: తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. తొలుత ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంశాఖ కీలక సమావేశానికి హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై… పలు కీలక అంశాలపై చర్చించారు.తెలంగాణకు వరద నష్టం సాయం పెంచాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని పెండింగ్లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ భేటీలో మూసీ ప్రక్షాళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
అటు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కూడా భేటీ అయిన రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్ ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కోరారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం మెుదటి విడత నిధులు, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా అందించే రూ.15 వేల కోట్లపైనా ఇరువురు చర్చించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన అంశాలనూ ప్రధాని దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్. ఢిల్లీ టెన్ జన్‌పథ్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై ప్రధానికి కృతజ్ఞతలు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు. రెండోరోజు పర్యటనలోభాగంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. అమిత్‌షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హార్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్న ఏపీ సీఎం.. సాయంత్రం 4.30కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం అవుతారు.. ఇక, 5:45కి కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీకానున్నారు.. రాత్రి 8 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశంకానున్నారు.. రాత్రి 11:15 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!