తూర్పు గోదావరి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురి దుర్మరణం చెందారు.. దీంతో.. దేవరపల్లి, ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే రహదారి రక్తసిక్తమైంది.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ రూపంలో మృత్యువు ఏడుగురిని బలితీసుకుంది.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణానదిలో భారీ వరలు.. విజయవాడ అతలాకుతలం అవుతోన్న సమయంలో ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం సంచలనంగా మారింది.. అయితే, దీని వెనుక కుట్ర కోణం ఉందంటూ అధికార కూటమి నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై సంచలన ఆరోపణలు చేశారు హోం మంత్రి అనిత.. ప్రకాశం బ్యారేజ్ కుల్చివేతకు కుట్ర పన్నిన జగన్మోహన్రెడ్డి, అందుకు సహరించిన వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కోరారు..
ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు.. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు..…
వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు..
విశాఖపట్నంలో కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.. రోడ్లను దిగ్బంధించిన స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగిరు.. అయితే.. నిరసనకారులకు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. కార్మిక నేతలను ఈడ్చుకెళ్లి వాహనం ఎక్కించారు పోలీసులు.. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది..
వరద నీరు తగ్గటంతో ఇంటి నుంచి బయటకు భోజనాలు తెచ్చేందుకు వెళ్లిన నాగబాబు అనే యువకుడికి విద్యుత్ షాక్‌తో ప్రాణాలు విడిచాడు.. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వచ్చి సీపీఆర్ చేసినా నాగబాబు ప్రాణాలు కాపాడలేకపోయాడు.. రోడ్డుపై నీరు ఉండడంతో.. ఆ నీటి నుంచి ఎందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకునే దాటేందుకు ప్రయత్నించాడు నాగబాబు.. అయితే.. విద్యుత్ స్తంభానికి అప్పడికే కరెంట్ పాస్ అయి ఉందని.. స్తంభం పట్టుకున్న వెంటనే నాగబాబుకు షాక్ తగిలిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
సెల్ ఫోన్ దొంగలించారనే అనుమానంతో దంపతులపై కొడవలితో దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం జోలపాలెంలో జరిగింది. సెల్‌ఫోన్ విషయంపై జరిగిన గొడవలో దంపతులపై ప్రత్యర్థి కొడవలితో దాడి చేసినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.