Minister Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్.. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ
- అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్..
- శాన్ ఫ్రాన్సిస్కో లో లోకేష్‌కు అపూర్వ స్వాగతం..
- పారిశ్రామికవేత్తతో సమావేశమైన లోకేష్..
- ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఏపీ అభివృద్ధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్‌కు.. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. ఇక, అక్కడ పారిశ్రామికవేత్తతో సమావేశం అయ్యారు లోకేష్.. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు నారా లోకేష్… శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్ లో రాబోయే పాతికేళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి, పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషిచేస్తున్నట్లు తెలిపారు.
Read Also: Baba Siddique : బాబా సిద్ధిఖీ హత్య కేసులో పాకిస్థాన్‌కు సంబంధం.. డ్రోన్ ద్వారా ఆయుధాల ఆర్డర్
Also Read
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ఇక, 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలో తమలాంటి యువనాయకత్వం చురుగ్గా పనిచేస్తోందని, మంత్రివర్గంలో 17మంది కొత్తవారే ఉన్నారని తెలిపారు లోకేష్. విభజిత ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు విజనరీ సిఎం చంద్రబాబునాయుడు సరికొత్త పి-4 విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఎపి సమగ్రాభివృద్ధికి ప్రతి వందరోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవవనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. నవీన ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ రీసెర్చి సెంట్రిక్ గా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రిగా అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా కెజి టు పిజి పాఠ్యాంశాల్లో మార్పులు చేయనున్నట్లు మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
Read Also: Papikondalu Tour: పాపికొండలు విహారయాత్ర ప్రారంభం.. బయల్దేరిన తొలి బోటు
ప్రముఖ పారిశ్రామివేత్త ప్రవీణ్ అక్కిరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్ విడియా వైస్ ప్రెసిడెంట్ రామ అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు, న్యూటానిక్స్ ప్రెసిడెంట్ రాజీవ్ రామస్వామి, దేవ్ రేవ్ సిఇఓ ధీరజ్ పాండే, గ్లీన్ సంస్థ సిఇఓ అరవింద్ జైన్, నెక్సస్ వెంచర్స్ ఎండి జిష్ణు భట్టాచార్య, సిస్కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర, సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని, స్పాన్ ఐఓ సిఇఓ ఆర్చ్ రావు, మిహిరా ఎఐ సిఇఓ రాజా కోడూరి, ఇవాంటి చీఫ్ ప్రొడక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ముక్కామల, హిటాచీ వంటారా సిఓఓ ఆశిష్ భరత్, గూగుల్ క్లౌడ్ జనరల్ మేనేజర్ సుని పొట్టి, వెస్ట్రన్ డిజిటల్ సిఐఓ శేషు తిరుమల, ఈక్వెనిక్స్ గ్లోబల్ ఎండి కెజె జోషి, త్రీడి గ్లాస్ సొల్యూషన్ సిఇఓ బాబు మండవ, పారిశ్రామికవేత్తలు వంశీ బొప్పన, రాజీవ్ ప్రతాప్, సతీష్ మంత్రి ప్రగడ, సతీష్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.




తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు