ఆధ్యాత్మికత.. హిందుత్వంపై ఓ పోస్టు పెట్టిన పవన్ కల్యాణ్.. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారత దేశ చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనపడుతూనే ఉంటాయన్న ఆయన.. ఆలయాలకు.. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. దీనిపై విమర్శలు, ఆరోపణల పర్వాలు కొనసాగుతుండగా.. కల్తీ నెయ్యిపై వ్యవహారంపై దర్యాప్తులో వేగం పెంచింది సిట్.. ఏఆర్ డైరీకి సహా గత బోర్డులో కోందరూ బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.. నేడు బృందాలుగా ఏర్పడి కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సిట్..
కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. నిద్రిస్తున్న వీఆర్ఏ మంచం కింద బాంబులు పెట్టి పేల్చారు గుర్తుతెలియని వ్యక్తులు.. ఈ ఘటనలో వీఆర్ఏ ప్రాణాలు కోల్పోగా.. ఆయన భార్య తీవ్రగాయాలపాలయ్యారు.. ఇక, వీఆర్ఏ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయినట్టుగా చెబుతున్నారు.. ఈ దారుణానికి పాతపక్ష్యలే కారణంగా అనుమానిస్తున్నారు..
తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని
మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు..