ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్.. అలాగే సీఎం రమేష్ అనే భక్తుడు సూర్యచంద్రులను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు హైమవతి సూర్యకుమారి బొట్టును అందజేశారు.. మొత్రం అభరణాలు వజ్రాలు పొదిగినవే.. 2 కోట్ల విలువైన కిరీటం దసరా నవరాత్రులలో ప్రత్యేకం కానుంది.
సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన.. హరిబాబు ఇంటికి వెళ్లారు.. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు.. విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. నడకమార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన.. వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తన దీక్ష విరమించారు..
కొందరు 35 ఏళ్లు దాటి.. 40 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకపోవడంతో.. ఏదో ఒక పిల్ల అయితే చాలని వెంటనే కమిట్ అవుతున్నారు.. 40 ఏళ్లకు పెళ్లి కుదరడంతో.. ఎగిరి గంతేసి.. వెనకాముందు చూడకుండా.. పెళ్లి చేసుకొని.. వారం రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో.. ఓ నవ వరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల 12వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు.
కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. విశేష పర్వదినాలుగా పిలిచే ఈ నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న మహాలయ అమావాస్యకాగా.. ఇవాళ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
నేడు తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో వారాహి సభ జరగనుంది.. జ్యోతి రావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహణకు జనసేన, కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు పవన్ కల్యాణ్.