తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు..
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
నేడు వైయస్సార్ జిల్లాగా చలామణిలో ఉన్న కడప జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా గెజిట్ మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. "రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ…
హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు.. స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు.. అయితే, నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు..
తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయని.. కానీ, శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని సూచించింది టీటీడీ.
ఆదాయార్జన శాఖలపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు ఉదయం నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. మధ్యాహ్నం ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జీఎస్టీ వసూళ్లపై ఆరా తీశారు.
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చ గొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్నారు.. ఇక, చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది.. స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలు ఆడి జంతువుల కొవ్వు కలిపినట్టు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు..
త్రేతాయుగం నుంచి సనాతన ధర్మం నడుస్తోంది.. నేడు సనాతన ధర్మాన్ని తానే కనిపెట్టినట్లు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.. సనాతన ధర్మం గురించి ఎవరు కించపరిచిన దాఖలాలు లేవు.. సనాతన ధర్మం పవన్ కు ఎందుకు గుర్తొచ్చింది..? గతంలో కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టేవారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది.. ఇక, రేపటి నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. అయితే, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో శ్వామలరావు.
కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్పెట్టారు.. రెండు పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు..