సూపర్ సిక్స్ అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి నుంచి P-4 కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. సంక్రాంతి రోజున P-4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా.. పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా P-4 కార్యక్రమం ఉంటుంది.. డ్వాక్రా సంఘాల తరహాలో స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేస్తాం.. స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటాం.. డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తాం అని పేర్కొన్నారు..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే.. తొలగించిన 4,000 మందిని ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోపోతే 48 గంటల్లో నిరాహార దీక్షకు దిగుతాను అని ప్రకటించారు.. నాలుగో తేదీన మధ్యాహ్నం ఒంటి గంటలోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులను తిరిగి తీసుకుంటున్నామని ప్రకటించకపోతే.. వైఎస్ షర్మిల రెడ్డి.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్షకు దిగుతుందని వెల్లడించారు.
మరోసారి ఈ వివాదంలో హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీఎం ఏమైనా మాట్లాడవచ్చన్న బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.. బావ కళ్లలో ఆనందం కోసం కాకుండా.. భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పని చేయాలి అంటూ సలహా ఇచ్చారు.. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీం కోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్న ఆమె.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడే మాటలు…
శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారట పవన్ కల్యాణ్.. స్వామివారి దర్శనం.. దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్ బుక్ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు పవన్.. దీంతో.. వారాహి డిక్లరేషన్ బుక్లో ఏముందు? అనే చర్చ సాగుతోంది..
గవర్నర్ ను కలిసే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. నెలరోజుల కిందట వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు పద్మ శ్రీ.. అయితే, ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆమోదముద్రపడలేదు.. తన రాజీనామాపై మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నారట..
తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.. ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమైందని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని కొణిదెల.. తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఇక, పలీనా అంజని మైనర్ కావడంతో.. ఆమె తండ్రిగా పవన్ కల్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది.. పలువురు వీఐపీల దగ్గర బౌన్సర్ గా పని చేసే కోటేశ్వరరావు అనే వ్యక్తిని హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. కోటేశ్వరరావు పీక కోసి హత్య చేసి పరారయ్యరు.. మృతుడు కోటేశ్వరరావు గతంలో పవన్ కల్యాణ్ తోపాటు, పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్ గా పని చేశాడని స్థానికులు చెబుతున్నారు..