లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు కాకినాడ కస్టమ్స్ అధికారులు.. కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ.3,18,200 లంచం తీసుకుంటుండగా.. పోర్టు కస్టమ్స్ సూపరిడెంట్ వై శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు.
ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. ఇక, 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
అంబటి రాంబాబు.... ఏపీ పాలిటిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా....అస్సలు పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి హోదాలో మాట్లాడినా, వైసీపీ ప్రతినిధిగా మైకందుకున్నా... తన వాగ్ధాటితో ప్రత్యర్థుల మీద విరుచుకుపడే అంబటి... ప్రస్తుతం కొత్త చిక్కుల్లో పడ్డారన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట.
తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలు టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ. ఎన్ని ఓట్లు పడ్డాయో అన్ని సభ్యత్వాలు ఎందుకు చేయించలేమన్న చర్చ సైతం జరిగింది పార్టీలో. ఆ క్రమంలోనే 50 లక్షల టార్గెట్ తెర మీదికి వచ్చింది. కానీ... టైం గడుస్తున్నా... ఇప్పటి వరకు కేవలం 15 లక్షల దాకా అయి ఉంటాయని పార్టీ నేతలే చెబుతున్నారు. అంటే... వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే.... తక్కువ సమయంలో ఇంకో 35 లక్షల మందిని సభ్యులుగా చేర్చాల్సి ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఇటీవలే…
పవర్లో ఉన్నా... చాలా విషయాల్లో పైచేయి అవలేకపోతున్నామని ఫీలవుతున్నారట తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు. ప్రజలకు మంచి చేస్తున్నా... అది వెళ్ళాల్సినంత ఎక్కువగా వెళ్ళడం లేదన్న చర్చ పార్టీలో గట్టిగానే జరుగుతోందంటున్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉన్న... విచ్చలవిడిగా పని చేసిన పార్టీ శ్రేణులు అధికారంలోకి వచ్చాక కాస్త సైలెంట్‌గా ఉంటున్నాయన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉందట. చివరికి ప్రతిపక్షాల విమర్శల్ని సైతం దీటుగా తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం గాంధీభవన్ పెద్దల్లో ఉందంటున్నారు.
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..