Koti Deepotsavam 2024 Day 6 LIVE: నవంబర్ 9వ తేదీన ఆరంభమైన కోటి దీపాల పండుగ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. ప్రత్యేక పూజలు చేస్తూ.. స్వయంగా దీపాలను వెలిగిస్తూ.. శివనామస్మరణతో మునిగితేలుతున్నారు..
Read Also: Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గందరగోళం.. కాంగ్రెస్ కౌన్సిలర్ రాజీనామా..
ఇక, నేడు కోటి దీపోత్సవంలో ఆరవ రోజు. వైకుంఠ చతుర్దశి వేళ విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ, శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీలు అనుగ్రహ భాషణం.. శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ ప్రవచనామృతం.. భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి పుష్పార్చన.. ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.. పల్లకీ వాహన సేవ.. వివిధ సంస్క్మృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా సాగుతోన్న కోటి దీపోత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..