Art of Living Ravi Shankar meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ.. గొప్ప మార్గం చూపారు..
- డిప్యూటీ సీఎం పవన్ తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ..
- ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు..
- దేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి రవిశంకర్ గొప్ప మార్గం చూపారు..
- ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్న పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Art of Living Ravi Shankar meets Pawan Kalyan: ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్నారు.. ఆధునిక యోగ ప్రక్రియల్లో సుదర్శన క్రియ ఎంతో విశిష్టమైనదని… అలాంటి యోగ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.
Read Also: Udaya Shankar: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ హఠాన్మరణం
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఇక, ఉత్సాహం, జ్ఞాపకశక్తి, ఆలోచనశక్తిని పెంచే ప్రక్రియగా సుదర్శన క్రియకు గుర్తింపు ఉందని, అలాంటి ప్రక్రియను పరోక్షంగా నాకు ఉపదేశించిన గురువు శ్రీశ్రీ రవిశంకర్ అని అన్నారు పవన్ కల్యాణ్.. వారు ఆశీర్వాదాలు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.. గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.. ఆయనను సాదరంగా స్వాగతం పలికి.. శాలువాతో సత్కరించారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కళ్యాణ్ ని సత్కరించి ఆశీర్వదించారు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించాలంటే ఏ వ్యక్తికైనా భక్తి, ముక్తి, యుక్తి, శక్తి అనే నాలుగు నైపుణ్యాలు చాలా అవసరం. ఆత్మ బలంతో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం వరిస్తుంది. పరిపాలనలో రాజు ఎప్పుడూ సంతృప్తి చెందకూడదు. సంతృప్తి చెందితే ప్రజలకు మేలు జరగడం ఆగిపోతుందన్నారు శ్రీశ్రీ రవిశంకర్..
Read Also: Salt: ఒక రోజులో ఎంత ఉప్పు తీసుకోవాలి..? నెల రోజులు ఉప్పు తినడం మానేస్తే ఏమౌతుంది
మరోవైపు.. విజయవాడ పర్యటనలో ఉన్న శ్రీశ్రీ రవిశంకర్.. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.. దర్శనానంతరం వేదాశీర్వచనం చేశారు వేదపండితులు.. రవిశంకర్ గురూజీ కి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు అర్చకులు, ఆలయ అధికారులు..





తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!