Temperature Drop: తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.. తెల్లవారుజామున బయటకు రావాలంటేనే వణికిపోయే పరిస్థితులు వస్తున్నాయి.. ఇక, ఏజెన్సీల్లో అయి మరీ దారుణంగా పరిస్థితులు ఉన్నాయి.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట స్థాయికి పడిపోయాయి ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ నమోదు అయ్యింది.. ఈ రోజు ముంచింగిపుట్టులో 9 డిగ్రీల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.. ఇక, పాడేరులో 12 డ్రిగ్రీలు నమోదు కాదు.. మినుములూరు, ముంచంగి పుట్టులో 09 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి..
Read Also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
మొత్తంగా ఏజెన్సీని చలి వణికిస్తోంది.. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. చలి తీవ్రతకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు స్థానికులు.. ఈ ఏడాది ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మరింత ఉష్ణోగ్రతలు పడిపోతాయే అంచనాలు ఉన్నాయి.. మరోవైపు.. పాడేరు, వంజంగి పర్యటక కేంద్రం వద్ద మేఘాల మాటున సూర్యోదయం తిలకించేందుకు కొండ పైకి భారీగా చేరుకున్నారు పర్యాటకులు.. సాధారణంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అరకు సహా ఏజెన్సీ ప్రాంతాల సందర్శనకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే విషయం విదితమే.. మరోవైపు తెలంగాణలోనూ చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. నిన్నటితో పోలిస్తే.. హైదరాబాద్ లో ఈ రోజు మరింత చలి తీవ్రత పెరిగింది..