TIDCO Houses: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పారు మంత్రి పొంగూరు నారాయణ.. త్వరలోనే లబ్దిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం అన్నారు.. శాసనమండలిలో టిడ్కో ఇళ్లపై ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి నారాయణ.. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం 5546.48 కోట్లు రుణం వివిధ రూపాల్లో తీసుకుందన్నారు.. టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులిస్తే వాటిని 2,61,660కు తగ్గించేసిందని విమర్శించారు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గత టీడీపీ ప్రభుత్వంలో హైటెక్నాలజీ, హై క్వాలిటీతో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం పై మాపై కక్షతో లబ్దిదారుల పట్ల దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు.. ఇళ్లు ఇవ్వని వారి పేరు మీద కూడా బ్యాంకు లోన్ లు తీసుకోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని.. లబ్దిదారులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మున్సిపల్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారు.
Read Also: Nayantara : నయనతార రిలేషన్ షిప్ ల గురించి నాగార్జున ఏమన్నారంటే ?
ఇక, గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ లో పెట్టేశారని దుయ్యబట్టారు మంత్రి నారాయణ.. అయితే, టిడ్కో ఇళ్లకు రంగులు మార్చడం కోసం ఏకంగా 300 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారని మండిపడ్డారు.. టిడ్కో ఇళ్లకు మౌళికవసతుల కల్పన కోసం 5200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశామని.. త్వరలోనే లబ్దిదారుల సమస్యలు పరిష్కరించేలా ముందుకెళ్తున్నాం అని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ..