Police Notice to RGV: ఆర్జీవీకి మళ్లీ పోలీసుల నోటీసు.. 25న విచారణకు రండి..
- రాంగోపాల్‌వర్మకు మరోసారి పోలీసుల నోటీసు..
- ఈ నెల 25న ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు రావాలి..
- వాట్సాప్ లో ఆర్జీవీకి నోటీసులు పంపిన ఒంగోలు రూరల్ సీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Notice to RGV: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మరోసారి నోటీసులు జారీ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఈ నెల 25వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కి హాజరుకావాల్సింది ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు పంపించారు.. దర్శకుడు రాంగోపాల్ వర్మ వాట్సప్ నంబర్‌కు సంబంధిత నోటీసు పంపించారు సీఐ శ్రీకాంత్. కాగా, ముందుగా జారీ చేసిన నోటీసు ప్రకారం మంగళవారం (ఈ నెల 19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కోరారు రాంగోపాల్ వర్మ.. ఈ మేరకు నిన్న ఉదయం సీఐకి వాట్సాప్ మెసేజ్ పెట్టిన విషయం విదితమే.. ఇక, ఆ తర్వాత వర్మ తరఫు న్యాయవాదులు కూడా వచ్చి ఒంగోలు రూరల్ పోలీసులకు ఈ సమాచారాన్ని ఇచ్చారు.. అయితే, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి (ట్విట్టర్) ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటోన్న విషయం విదితమే..
Read Also: Fire Accident: జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి..
Also Read
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
అయితే, రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై సోమవారం రోజు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది.. మంగళవారం విచారణ హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారని పిటిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది అభ్యర్థించారు.. ఇక, సమయం పొడిగించాలనే అభ్యర్థనను పోలీసులు ముందు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.. ఇటువంటి అభ్యర్థన కోర్టు ముందు కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.. అయితే, నిన్న విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీ.. మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.. ఒంగోలు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది..
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!