CM Chandrababu: నిరుద్యోగులకు శాసన సభ వేదికగా శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. త్వరలోనే 16 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై మా ఆలోచన.. ఓర్వకల్లు ను డ్రోన్ సిటీగా తయారు చేస్తాం.. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తాం.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ను తీసుకొస్తున్నాం.. సోలార్ పేనెల్స్ పెడతాం.. కరంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామన్నారు.. ఇక, ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్.. ఉద్యోగకల్పన మా విధానం అని చాలా స్పష్టంగా చెప్పాం.. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదట సంతకం మెగా డీఎస్సీపై పెట్టాం.. ఈ మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం అన్నారు. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం.. అయితే, రాత పరీక్షకు కొంత సమయం కావాలంటే ఆ టైం ఇచ్చాం.. ఇక, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి.. వీలైనంత త్వరగా 16,347 ఉగ్యోగాలు మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయడానికి ముందుకు వెళ్తాం అన్నారు చంద్రబాబు..
Read Also: Winter Foods to Eat: చల్లగా ఉందని వేడి వేడిగా బజ్జీలు, పకోడీలు చిరుతిళ్లు లాగిస్తున్నారా?
ఇక, కూటమి ద్వారా ఏపీకి సుపరిపాలన అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములును మేం ప్రభుత్వం తరుఫున గౌరవిస్తాం అన్నారు.. సెంటిమెంట్ లను మేం గౌరవిస్తాం అన్నారు.. సినిమాలు తీయాలన్నా రాయలసీమలో పాత చరిత్రలే అని పేర్కొన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లు ఇంకా ఉన్నాయి.. జాగ్రత్త అని చెబుతూనే.. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు.. అన్ని నగరాలలాగా మనం కూడా అభివృద్ధి చెందబోతున్నాం.. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయి.. ఆదాయం పెంచడం మన కర్తవ్యం.. మన ప్రజలకు బాధ్యులం.. నాలెడ్జ్ ఎకానమీలో మన వాళ్లు అగ్రదేశంలో ఉన్నారు.. ఏపీలో అమెరికా లాంటి వాతావరణం తీసుకురావాలన్నదే తమ లక్ష్యంగా పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..