Non Veg Markets Full Busy: సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నాయి పల్లెలు.. ఆటలు, పాటలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గుండాటలు.. ఇలా అంతా కోలాహలంగా సాగుతోన్న పండుగ చివరి రోజుకు చేరుకుంది.. ఇక, కనుమ పండుగ సందర్భంగా నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి.. చికెన్, మటన్, చేపలు ఇలా నాన్‌వెజ్‌ను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు తరలివస్తున్నారు జనం.. కనుమ రోజు అతిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నారు గోదావరి జిల్లా వాసులు. . దీంతో.. నాన్‌వెజ్ అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాన్ వెజ్ మార్కెట్లలో రద్దీ వాతావరణం నెలకొంది. భోగి, సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న జిల్లా వాసులు కనుమ రోజు నాన్‌వెజ్ వంటకాలతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో చికెన్, మటన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువైంది. ఫిష్ మార్కెట్లు బిజీగా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ నుంచో తరలివచ్చిన అతిధుల కోసం ప్రత్యేక వంటకాలు చేసే పనిలో జిల్లా వాసులు నిమగ్నమయ్యారు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది..
Read Also: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో నిన్న ఒక్కరోజే 3.5 కోట్ల మంది భక్తులు!
ఇక, విజయవాడ నగరంలో చికెన్, మటన్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. కనుమ పండుగ కావటంతో తెల్లవారు జాము నుంచే మటన్ కొనుగోలుకు నాన్ వెజ్ ప్రియులు మార్కెట్లకు క్యూ కడుతున్నారు.. మటన్ తో పాటు నాటు కోళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.. మటన్ తో సమానంగా నాటు కోళ్లు రేటు పలుకుతున్నాయి. పండుగ సందర్భంగా డిమాండ్ కు తగినట్లుగా మాంసం సరఫరాకు వ్యాపారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. కనుమ పండుగను నెల్లూరు జిల్లాలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. పండుగ మొదటి రెండు రోజులూ.. పిండి. వంటలకు ప్రాధాన్యమిచ్చే ప్రజలు మూడో రోజున మాంసాహార వంటకాలను వండుకుంటారు.. దీంతో తెల్లవారుజామున నుంచి నెల్లూరులోని చికెన్.. మటన్ స్టాళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా నెల్లూరు మార్కెట్ నుంచి చికెన్.. మటన్, రొయ్యలు, చేపలను తీసుకువెళుతున్నారు. ఫారం కోళ్లతో పోలిస్తే నాటు కోళ్లకు డిమాండ్ అధికంగా కనిపిస్తోంది.
Read Also: Game Changer : గేమ్ ఛేంజర్ సినిమాపై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్
మరోవైపు, కోడిపందాల్లో ఓడిన కోడి పుంజులకు కూడా భారీ డిమాండ్ నెలకొంది.. ఓడిపోయిన కోళ్లను కోడిపందాల బరుల దగ్గరే కొనేందుకు పోటీ పడుతున్నారు.. పందెం కోళ్లకు ప్రత్యేకమైన ఆహారం ఇచ్చి పెంచుతారు కాబట్టి.. అవి సాధారణ కోళ్లు, నాటు కోళ్ల కంటే.. మరింత రుచిగా ఉండడమే దీనికి కారణంగా చెబుతున్నారు.. పందెం కోళ్ల రుచి చూడని జన్మ ఎందుకు అంటున్నారు గోదావరి జిల్లాల వాసులు.. మొత్తంగా కనుక వేళ నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారిపోయాయి..