59 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ.. రెండో జాబితా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. 59 మందితో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి 9 మందికి.. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కగా.. మిగతా పోస్టులు తెలుగుదేశం పార్టీకి చెందినవారికి దక్కాయి..
దేశంలోనే సీ ప్లేన్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభం అన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. కొన్ని మార్గదర్శకాలు మార్చి సామాన్యులకు అందుబాటు ధరలో ఉండేట్లు స్కీం ను రూపొందిస్తున్నాం అన్నారు.. ఎయిర్ పోర్ట్ కట్టాలంటే కనీసం 500 ఎకరాల అవసరం లేకుండా వాటర్ ఏరో డ్రోమ్స్ సహాయంతో ఎయిర్ ట్రావెల్ కు అవకాశం ఉందన్నారు.. ఉడాన్ స్కీం ద్వారా వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది.. టూరిజం కూడా సహకరిస్తే ఇంకా వేగంగా ముందుకు వెళ్తాం అన్నారు..
విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన నాలుగో రోజు కొనసాగనుంది. గడిచిన మూడు రోజుల్లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన బృందం కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణంపై ఒక క్లారిటీ కి వచ్చింది. 2026 నాటికి వాల్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇదే సమయంలో ప్రధాన డ్యామ్ అయిన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఏరకంగా మొదలుపెట్టాలి అనే విషయంపై నాలుగో రోజు అధికారులతో చర్చించనున్నారు.
వస్త్రాలు లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తిరిగి వివాదాలను సృష్టించారు అఘోరీ నాగసాధు. నిన్న కర్నూలు రోడ్లపై వస్త్రాలు లేకుండా తిరిగి హల్చల్ చేశారు. అయితే, తెల్లవారేసరికి మహానంది క్షేత్రంలో ప్రత్యక్షమయ్యరామే. కర్నూలులో ఆమె సొంత కారు పాడైపోవడంతో ప్రైవేట్ కారులో వచ్చారు అఘోరీ నాగసాధు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై కేసు నమోదు చేశారు పోలిసులు.. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్ర శేఖర్ పెట్టిన పోస్ట్‌లపై స్థానిక టీడీపీ నేత కిషోర్ ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్‌పై స్పందించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. "రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది.. మన ఎన్డీఏ ప్రభుత్వం మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.. కొంతకాలం క్రితం, విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని, గత…
ఇవాళ ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, పర్యాటక శాఖామంత్రి, ఇతర స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు.. పున్నమి ఘాట్ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు.. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు..
కార్తీక మాసంలో ప్రతీ ఏటా కోటి దీపోత్సవాన్ని.. అశేష భక్తవాహిణి మధ్య నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.. లక్ష దీపోత్సవంతో ప్రారంభమై.. కోటి దీపోత్సవంగా మారిన ఈ దీపాల పండగను రచన టెలివిజన్ లిమిటెడ్ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.