వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారుల సోదాలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి.. రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వ్యాపార సంస్థల్లో, భాగస్వాముల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు ఈ రోజు కూడా కొనసాగనున్నాయి.
నేడు పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగనుంది.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చించనున్నారు.. డయా ఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా..? లేదా..? అనే విషయంపై అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం.. ప్రాజెక్టు అధికారులు, కేంద్ర జల సంఘం చైర్మన్ తో విడివిడిగా సమావేశం కానున్నారు..
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచ్ సంఘాలతో సమావేశం అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై స్పందించిన పవన్.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..
రాజధాని అమరావతిలోని విట్ ఆంధ్రప్రదేశ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించారు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఉన్నత విద్య ఫెయిర్ ను ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు.. అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రధానంగా జీవితానికి ఉపయోగపడే విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు..
రాజధాని అమరావతి ప్రాంతానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. అందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా తాళ్లాయిపాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రూ.505 కోట్లతో నిర్మించిన గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ను ప్రారంభించిన సీఎం.. అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 400/220కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)ను నిర్మించింది ప్రభుత్వం.
ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. అయితే, ఈ నెల 26వ తేదీ వరకు కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు..