శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగలో సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.. ట్రయల్ రన్ లో భాగంగా సేఫ్ గా నీటిపై ల్యాండ్ అయ్యింది సీ ప్లేన్.. ఇక, సీ ప్లేన్ ట్రయల్ రన్ ని దగ్గరుండి పరిశీలించారు నంద్యాల జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు.. కాగా, రేపు విజయవాడలో సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
కోటి దీపోత్సవం నేపథ్యంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పేర్కొంది గ్రేటర్ ఆర్టీసీ.. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ సిటీలోని 18 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ప్రకటించింది.. ఆ వివరాల కోసం.. 99592 26160, 99592 26154 మొబైల్ నంబర్లను సంప్రదించాలని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది..
గతంలో పవన్ కల్యాణ్‌ను ఏపీకి రాకుండా అడ్డుకుంది మీరు కాదా..? అంటూ మండిపడ్డారు బీజేపీ మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీఏ అధికారంలో ఉండగా వైసీపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు.. ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా టైం వేస్ట్ అని స్పందించ లేదు.. విశాఖలో కిషోర్, విజయవాడలో రాజేష్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కర్నూలు మొత్తం తిప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు
నోటీసులపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు కేతిరెడ్డి.. చెరువు భూములు కబ్జా చేశారని తన తమ్ముడి భార్యకు నోటీసులు ఇవ్వడంపై రియాక్ట్ అయిన ఆయన.. ఈ నోటీసుల వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. చెరువు భూములు కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై తాను గతంలోనే కోర్టుకు వెళ్లానని తెలిపారు.. దీనికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్నవారు నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు..
శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం చెరువు కబ్జా వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబానికి షాక్ ఇచ్చారు అధికారులు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.. ధర్మవరం చెరువును కబ్జా చేశారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమం 1300రోజులు దాటింది. ఐక్య కార్యాచరణ సమితి దశలవారీగా పోరాటాన్ని విస్తరిస్తోంది. మరోవైపు, రాజకీయ పక్షాలకు ఈ వ్యవహారం సంకటంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఉక్కు పరిరక్షణలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? అనే చర్చ ప్రజల ముందుకు వస్తోంది. అదే సమయంలో ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రకటించారు. పోలీసులను పెట్టి వైసీపీ నేతల్ని ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక సక్రమంగా జరిగే అవకాశం లేదన్నారు. అందుకే తాము ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడయ్యామని తెలిపారు పేర్ని..