పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు..
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..
ఈఎంఐ డబ్బులు చెల్లించకపోవడంతో న్యూడ్ ఫొటోలు పంపించిన రికవరీ ఏజెంట్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు..
ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ ధరలు పెరుగుతున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది.. మార్కెట్ రేట్ పెరిగితే ఆటోమాటిక్ గా రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి.. దీంతో కొంతమంది ప్రజలు కూడా ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో తొందర పడుతున్నారు. అయితే, ఈ నెల 30వ తేదీన సీసీఎల్ఏలో కీలక సమావేశం జరగనుంది. జోనల్ రెవెన్యూ సమావేశంలో కొన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. భూముల మార్కెట్ ధరలపై చర్చిస్తారు. అయితే, ఇప్పటికే జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో నివేదిక సిద్ధం అయ్యింది..…
వైసీపీ మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైసీపీకి రాజీనామా చేశారు.. అంటే, ఆయన కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. మొత్తం రాజకీయాలకే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు.. గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇంతియాజ్.. ఓటమి పాలయ్యారు.. అయితే, ఇప్పుడు ఇంతియాజ్ రాజీనామా లేఖ విడుదల చేశారు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.. ఇక, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ విడుదల చేసిన రాజీనామా లేఖను ఓసారి పరిశీలిస్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచినా విధానాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందన్నారు. దానిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన నారా లోకేష్.. నేడు వాటిని బిగించాలని చెప్పటం సిగ్గుచేటని శ్రీనివాస రావు మండిపడ్డారు.
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. ఎన్నికల హామీలను చంద్రబాబు మర్చిపోయారని దుయ్యబట్టారు.. ఇక, విద్యుత్ ఛార్జీలపై పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ ఏమైంది? అని అంటూ నిలదీశారు.. అసలు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ పోతుంటూ.. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ అసలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు.. ఏదేమైనా పెంచిన ఛార్జీలు తగ్గించేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు మాజీ మంత్రి ఆర్కే…
జెసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరాడు.. నమ్మశక్యం కావడం లేదు.. కానీ ఇదీ నిజం... ప్రత్యర్థులైనా.. అధికారుపై అయినా గుడ్లు ఉరిమి చూస్తూ భయపెట్టే జేపీ.. క్షమాపణాలు చెబుతూ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది... దీంతో, ఫ్లైయాష్ వివాదంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి జేసీ ప్రభాకర్ రెడ్జి క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది..