తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారానికి రెండు... రూ.3 వందల దర్శనానికి సిఫార్సులేఖలకు ఏపీ సీఎం అనుమతించారు.. దీంతో.. టీటీడీ, సీఎం చంద్రబాబు.. తెలంగాణ ప్రజా ప్రతినిధులకు శుభవార్త చెప్పినట్టు అయ్యింది..
న్యూఇయర్ సమీపిస్తున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది.. కోరుకొండ మండలం బూరుపూడి గేటు దగ్గర ఉన్న నాగ సాయి ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ నిర్వహించారు.. జిల్లా ఎస్పీకి వచ్చిన చమచారంతో పోలీసు ప్రత్యేక బృందాలు నాగసాయి పంక్షన్ హాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు.
ఆర్కే రోజా... ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్. ఎనీ సబ్జెక్ట్, ఎనీ సెంటర్... తెలిసినా, తెలియకున్నా సరే.. వాగ్ధాటితో అవతలోళ్ళ నోరు మూయించడంలో దిట్ట. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా పనిచేసిన రోజా.... గత ఎన్నికలలో దారుణమైన ఓటమి తర్వాత దాదాపుగా పొలిటికల్ అజ్ఞాతంలో ఉన్నారు. పాలిటిక్స్‌లో నోరే నా ఆయుధం అనుకున్న మాజీ మంత్రికి గత ఎన్నికల్లో అదే రివర్స్ అయిందన్న అభిప్రాయం ఉంది.
అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటన కలకలం రేపుతోంది.. అయితే, ఈ ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య…
ఈసారి రాష్ట్రం మీద బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ చేస్తోందన్న వార్తల నడుమ తెలంగాణ బీజేపీకి కొత్త సారధిగా ఎవరు వస్తారన్న సస్పెన్స్ డబుల్ అవుతోందట రాజకీయ వర్గాల్లో. ఇక పార్టీలో అంతర్గతంగా అయితే... చెప్పే పనేలేదు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా... మాటలన్నీ కొత్త అధ్యక్షుడి గురించేనట. ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తూ... వాళ్ళ ప్లస్‌లు, మైనస్‌ల గురించి డిస్కస్ చేసుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు. అదే సమయంలో ఇటువైపు సీరియస్‌గా దృష్టిపెట్టి అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్టు సమాచారం.
బొత్స సత్యనారాయణ.... లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ప్రస్తుతం ఇదే పొలిటికల్ హాట్. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఓ వెలుగు వెలిగిన నేత. రాజకీయ విమర్శలను సైతం తూకం వేసినట్టు చేసే బొత్సకు 2024 ఎన్నికలు చేదు అనుభవం మిగిల్చాయి. కంచుకోట లాంటి చీపురుపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కళా వెంకట్రావ్ చేతుల్లో ఓడిపోయారాయన.
పేర్ని నాని భార్య కేసులో ఏ1 జయసుధ తరఫు న్యాయవాదులు తమ వాదన వినిపిస్తూ.. గోడౌన్లో బస్తాల షార్టేజ్ వచ్చినట్లు గుర్తించి.. నవంబర్ 27వ తేదీన ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.. అయితే, డిసెంబర్ 3, 4 తేదీల్లో గోడౌన్లో తనిఖీలు నిర్వహించి.. 10వ తేదీన డిమాండ్ నోటీసు ఇచ్చారని కోర్టుకు వివరించారు. అనంతరం డిసెంబర్ 12వ తేదీన కేసు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. బియ్యం తగ్గిన విషయం తామే ముందు గుర్తించి ప్రభుత్వానికి చెప్పామని తెలిపారు..
2024కి బైబై చెప్పేసి.. 2025కి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం సిద్ధం అవుతోంది.. ఇక, కొత్త సంవత్సర వేడుకలకు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం కూడా రెడీ అవుతోంది.. ధూంధామ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.. మెలోడీ బ్రహ్మ మణిశర్మతో పాటు ప్రఖ్యాత సింగర్లు, నటి నటులతో ఈవెంట్స్ అదరగొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.. అమరావతిలో భారీ సెట్లలో నాలుగు గ్రాండ్ ఈవెంట్స్ జరగబోతున్నాయి.. విజయవాడ, అమరావతి పరిసర ప్రాంతాల్లో అప్పుడే ఈ ఈవెంట్స్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది..