Vangalapudi Anitha Vs Botsa: బుడమేరు బాధితులకు వరద సాయంపై మండలిలో రచ్చ.. మంత్రి అనిత వర్సెస్ బొత్స..
- శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై రచ్చ..
- మంత్రి వంగలపూడి అనిత.. బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha Vs Botsa: శాసన సభ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. శాసన మండలిలో మాత్రం వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో.. వైసీపీ వర్సెస్ కూటమి సర్కార్‌గా శాసన మండలి మారుతోంది.. ఈ రోజు శాసనమండలిలో బుడమేరు బాధితులకు వరద సాయంపై మంత్రి వంగలపూడి అనిత వర్సెస్ బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.. మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం.. నేనే అందుకు బాధ్యత తీసుకున్నాను అన్నారు. కానీ, ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. ప్రభుత్వం పై మాకు నమ్మకం లేదు. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని వెల్లడించారు బొత్స..
Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
- Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
- Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
ఇక, హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. బుడమేరు వరద దురదృష్టకరం అన్నారు.. ఆక్రమణల కారణంగా బుడమేరు వరదలు వచ్చాయన్న ఆమె.. 2005 లో భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్ధ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి.. 20 శాతం నేటికీ పూర్తవ్వలేదు.. గత ప్రభుత్వం వదిలేయడం వల్లే మొన్నటి వరదల్లో విజయవాడ మునిగిపోయిందని ఆరోపించారు.. సీఎం 11 రోజులు బస్సులోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నారు.. అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులు అందించాలనే ఆలోచన రావడం సంతోషం. విజయవాడ వరద బాధితులను అన్నిరకాలుగా ఆదుకున్నాం. ఇంట్లో వస్తువులకు డబ్బులిచ్చాం. వాహనాలకు డబ్బులిచ్చాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు విడుదల చేశాం. వరద బాధితుల్లో ఎక్కడా అసంతృప్తి లేదన్నారు..
Read Also: Eblu Feo X: 5 సంవత్సరాల వారంటీతో బడ్జెట్ ధరలో ఫ్యామిలీ EV స్కూటర్!
ఈ రోజుకీ ఎవరైనా అర్హులైన బాధితులుంటే వారికి సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి అనిత.. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరద బాధితులకు కోటి రూపాయలు ప్రకటించారు. ఆ డబ్బులు మా విపత్తుల శాఖకు ఇంతవరకూ అందలేదన్నారు.. వైసీపీకి చెందిన ఓ పత్రిక ఎలాఉందో… సభలో వైసీపీ సభ్యులు అలానే ఉన్నారని ఎద్దేవా చేశారు.. ఎంతమందికి సాయం అందిందో ఆర్టీఐ యాక్ట్ లో పెడితే తెలుస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు సూచించారు హోం మంత్రి వంగలపూడి అనిత.. అయితే, బుడమేరు వరదలపై చర్చ సందర్భంగా.. శాసన మండలిలో బొత్స వర్సెస్ మంత్రి అనితగా మారిపోయింది పరిస్థితి..
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!