Minister Nara Lokesh: ఆర్కియాలజీ లైబ్రరీల గురించి అసెంబ్లీలో ప్రశ్నోత్నరాల సమాయంలో చర్చ సాగింది.. రాష్ట్ర విభజన జరిగినప్పుడు.. ఆస్తి, అప్పుల విభజనలో ఏపీకి ఆర్కియాలజీ లైబ్రరీకి సంబంధించి సాంస్కృతిక సంపద పూర్తిగా రాలేదని లేవనెత్తారు జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్.. ప్రభుత్వం వెంటనే ఆర్కియాలజీ శాఖ లైబ్రరీపై దృష్టి పెట్టాలని కోరారు.. ఇక, మండలి బుద్ధ ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. రాష్ట్ర విభజన తర్వాత 50 శాతం ప్రాచీన పత్రాలు రాష్ట్రానికి బదిలీచేశారని, మిగిలినవాటిని రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఇవ్వాల్సింది: అశ్విన్
రాష్ట్ర ప్రాచీనపత్ర భాండాగారం నుంచి అధికారిక పత్రాలు, శాసనాలు, రికార్డులు రాష్ట్రానికి రప్పించే అంశంపై శాసనసభలో మంత్రి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రశ్నించారు.. తెలుగుజాతి చరిత్ర పరిరక్షణకు ఆర్కీవ్స్, ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీకి, డిస్ట్రిక్ట్ గెజిట్స్ అనే మూడు సంస్థలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, గురజాడ అప్పారావు వంటి మహనీయులు రాసిన లేఖలు ఆర్కీవ్స్ ఉన్నాయన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ అంశాన్ని షెడ్యూలు 10లో చేర్చారు. జాతి సంపదను కాపాడాకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. లైబ్రరీస్ పై మూడు సార్లు రివ్యూ చేశాం అన్నారు.., ఆర్కివ్స్ పై వెనుకబడి ఉన్నామని.. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అన్నారు.. 10వ షెడ్యూలులో ఈ సంస్థ ఉందన్నారు.. మొత్తం 15 కేటగిరిల రికార్డులకుగాను 7 కేటగిరిలు ఇచ్చారు. రెండు కాపీలు ఉన్నవి. ఒకటి మనకు ఇచ్చా, ఒకే ఒక కాపీ ఉన్నవాటిపై చర్చించాల్సి ఉంది. డిజిటలైజ్ చేసి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తాం. బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరాం, అవసరమైతే సీఎస్ఆర్ నిధులు తెచ్చి పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తాం. పెద్దఎత్తున డిజిటలైజేషన్ చేపట్టాల్సి ఉంది. 24,347 చదరవు అడుగుల అద్దె భవనంలో ప్రస్తుతం ఆర్కివ్స్ విభాగం పనిచేస్తోంది, అక్కడే రికార్డులన్నీ నిర్వహిస్తున్నాం. రాష్ట్రవిభజన తర్వాత మనకు సెంట్రల్ లైబ్రరీ లేనందున అమరావతిలో భూమి కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరాం. అక్కడే ఆర్కివ్స్ పరిరరక్షణపై దృష్టి పెడతాం. ఆర్కీవ్స్ పై శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తాం. టెక్నాలజీ జోడించి, ఆర్కివ్స్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం అన్నారు..
Read Also: Nizamabad: నిజామాబాద్‌లోని మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు..
ఇక, కేంద్రప్రభుత్వ నిధులు రాబట్టే అంశాన్ని పరిశీలిస్తాం. డిజిటలైజేషన్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి లోకేష్.. ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ నుంచి రికార్డులను రప్పించే కార్యక్రమాన్ని ఈ ఏడాది పూర్తిచేస్తాం. డిస్ట్రిక్ట్ గెజిట్స్ మంగళగిరికి వచ్చాయని సమాచారం ఉంది, పెండింగ్ ఉన్న వాటిని రప్పించేందుకు చర్యలు చేపడతాం. పాదయాత్ర సమయంలో గ్రంథాలయాల అవసరం తెలుసుకున్నా. వివిధ అంశాలపై చర్చించడానికి లైబ్రరీ వేదిక ఉంటుందని తెలుసుకున్నా. అధికారుల కొరత ఉంది. గ్రామ, నియోజకవర్గ, జిల్లా, ప్రాంతీయ, సెంట్రల్ లైబ్రరీలు ఎలా ఉండాలనే విషయమై చర్చిస్తున్నాం. నేషనల్ ఆర్కియాలజీ అధ్యయనం చేసి, వచ్చే సంవత్సరం గ్రంథాలయాల ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాజమండ్రి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ… భాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, గౌతమి లైబ్రరీ కాపాడటానికి 13 ఏళ్లు పట్టింది. వీటి పరిరక్షణకు బడ్జెట్ తక్కువగా ఉంది. గతంలో రాజారామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ నిధులిచ్చేవారు. లైబ్రరీల్లో విలువైన పుస్తకాలు కొనుగోలు చేయాలని కోరారు.