* నేటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు..
* హైదరాబాద్: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి రిప్లై
* హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ నేడు అసెంబ్లీ ముందుకు సవరణ బిల్లు .. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం.
* హైదరాబాద్: ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి అంగన్వాడి కేంద్రాలను ఒంటి పూట నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు.. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు అంగన్వాడి కేంద్రాలు
* హైదరాబాద్: నేడు ఉదయం 8:45 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకోనున్న నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు అంజి రెడ్డి, కొమరయ్య.. ప్రత్యేక పూజ నిర్వహించనున్న ఎమ్మెల్సీలు..
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచి వున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,987 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,880 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు
* జగిత్యాల జిల్లా : ఘనంగా కొనసాగుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. నేడు కొనేరులో ఉగ్ర నరసింహుని తెప్పోత్సవం డోలోత్సవం
* రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయంలో రేపటినుండి 20వ తేదీ వరకు శివ కళ్యాణ మహోత్సవాలు.. 17న స్వామివారి శివ కళ్యాణ మహోత్సవం
* ఇవాళ ఉదయం 10 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. తణుకులో స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న. సీఎం చంద్రబాబు
* ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కొండపిలో జరిగే స్వచ్ఛఆంధ్ర – స్వర్ణఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జరుగుమల్లి మండలం కామేపల్లిలో కస్తూర్బాగాంధీ పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు..
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటి పట్టణంలో 1.40 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…
* కాకినాడ: నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశం.. హాజరుకానున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు.. జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరగనున్న సర్వసభ్య సమావేశం
* కాకినాడ: జిల్లా పర్యటన ముగించుకుని ఉదయం 11 గంటలకు మంగళగిరి బయలుదేరి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉదయం అధికారులతో పిఠాపురం, జిల్లా అభివృద్ధిపై సమీక్ష
* నేటి నుంచి ఏపీలో ఒంటిపూట బడులు.. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్న ఒంటిపూట బడులు.. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు.. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం.. ఆ పరీక్షలు ముగిసే వరకు మధ్యాహ్నం 1.15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు
* నేడు కృష్ణా జిల్లా జడ్పీ స్థాయి సంఘ సమావేశం.. మచిలీపట్నంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్ యాదవ్.
* కర్నూలు: నేడు కోడుమూరు మండలంలోని గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలలో హనుమంతోత్సవం
* నంద్యాల: ఆళ్లగడ్డ మండలం దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలలో నేడు గరుడోత్సవం, ధ్వజారోహణం…
* కర్నూలు: మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పుష్పభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామివారిని రథంపై ఉరేగింపు….
* రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ ధర్మవరం పర్యటన వివరాలు. ఉదయం 8:30కి ధర్మవరం కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన స్వచ్ఛభారత్, మున్సిపల్ కార్మికులతో పరస్పర చర్చ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం ముదిగుబ్బ మండలం మలకవేముల హంద్రీనీవా కాలవలోని లైనింగ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బత్తలపల్లిలో కొత్తగా నిర్మించినటువంటి బిసి హాస్టల్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ కుటుంబ సభ్యులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ధర్మవరంలోని పురవీధులను సందర్శిస్తారు..
* విజయనగరం: స్వర్ణాంధ్ర – స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు గంటస్థంభం నుంచి బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ.. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి డా.ఏ.బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, వివిధ వర్గాల ప్రజలు పాల్గొంటారు.
* విజయనగరం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేటి కార్యక్రమాలు.. బీసీ కాలని మహిళా ప్రగతి కేంద్రంలో ఇంటిగ్రటేడ్ ఫారం పాండ్ (Acqua) ప్రారంభ కార్యాక్రమములో పాల్గొంటారు. గంట్యాడ మండలం మదనపురం గ్రామంలో స్వచ్చ ఆంధ్ర-2025 కార్యాక్రమములో పాల్గొంటారు. మదనపురం గ్రామంలో గల ఏ.పి. మోడల్ స్కూల్ నందు “Dignitary Presence would greatly honor this momentous occasion as we celebrate our commitment to community service & innovation“నిర్వహించు కార్యాక్రమములో పాల్గొంటారు. విజయనగరం కలక్టర్ ఆడిటోరియంలో నిర్వహించు “SWARNA ANDHRA @ 2047 – CONSTITUENCY DEVELOPMENT VISION PLAN MEETING” కార్యాక్రమములో పాల్గొంటారు.