వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీలో లీడర్ల కంటే లోఫర్లు ఎక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకుని, బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెట్టర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పనీ పాటా లేని విమర్శలుగా కొట్టిపారేశారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంపికను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. డీజీపీ ఎంపికలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని పిల్ వేశారు.. నిబంధనల ప్రకారం డీజీపీ పోస్ట్ కి అర్హత కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీ కి పంపాలని పిల్ లో పేర్కొన్నారు పిటిషనర్..
సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి భారీ ఊరట లభించింది.. వైఎస్ జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్ పై ఉన్న కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ కూడా డ్యాన్స్‌లు అదరగొట్టారు.. భార్యతో కలిసి సినిమా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు కలెక్టర్ బాలాజీ..
టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. మూడు నెలలపాటు శ్రమిస్తే వారికి నష్టాలే మిగిలాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు.
ఆ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశాడు తాడేపల్లి మండలం పాతూరు గ్రామానికి చెందిన అంజిబాబు అనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారుడు.. అయితే, డిపాజిట్ చేసిన నోట్లలో 18 వేల రూపాయల దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్లో ఆ మొత్తం జమ కాలేదు.. ఇక, తాను 50,000 డిపాజిట్ చేయగా అందులో 18,000 డిపాజిట్ అవ్వలేదని బ్యాంకు మేనేజర్ కు సదరు ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు.
నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. జైలు సూపరింటెండెంట్ శ్రీరామ్ రాజారావు అవినీతి, అక్రమాలపై అధికారులు నోరువెల్లబెడుతున్నారు.. రిమాండ్ ఖైదీల తాలుకు బంధువుల నుంచి నగదు, మద్యం డిమాండ్ చేసిన ఫోన్ సంభాషణ మరువకముందే వెలుగులోకి మరో అవినీతి బాగోతం వచ్చింది.