CM Chandrababu: సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే వారికి అదే చివరిరోజు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు… సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు.. ఎవరైనా సరే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరిరోజు అని హెచ్చరిస్తున్నా అన్నారు.. మహిళలను గౌరవప్రదంగా బతకనివ్వాలని.. చేతనైతే విలువలు నేర్పించాలన్నారు.. వైఎస్ భారతిపై చేసిన అసభ్య వ్యాఖ్యల సందర్భంలో చంద్రబాబు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Hari Hara Veera Mallu: సిద్ధంగా ఉండండి.. రూమర్స్‌పై మేకర్స్ క్లారిటీ!
జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శం.. సమానత్వం మానవతా విలువలు పూలే సొంతం అన్నారు చంద్రబాబు.. బీసీలు టీడీపీకి వెన్నెముక.. జిల్లాల వారీగా బీసీల అభివృద్ధికి ముందుకు వెళ్తున్నాం.. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి.. నేను పవన్ కల్యాణ్ అభివృద్ధి పై దృష్టి పెట్టాము.. జీరో పవార్టీ వినూత్న కార్యకమం.. P4 కోసం తెలుగులో పేరు వెతికాం.. కానీ, దొరకలేదు.. సమాజంలో ఎంతో మంది గొప్పవారు అయ్యారు.. ఆగిరిపల్లి లో 206 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. మార్గదర్శిలు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలి.. ఆగిరిపల్లి లో ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించే బాధ్యత జిల్లా కలెక్టర్ యంత్రాంగం తీసుకోవాలన్నారు.. విద్యుత్ మరుగుదొడ్లు.. మంచినీరు.. ఇలా అన్ని అంశాల్లో జిల్లా యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సూచించారు.. ఇక, ఆగిరిపల్లిలో p4లో భాగంగా కొన్ని కుటుంబాల బాధ్యతలను నూజివీడు సీడ్స్ అధినేతకు ప్రభాకర్ కు అప్పగించారు సీఎం చంద్రబాబు..
Read Also: Vodka Flavours: వోడ్కా లవర్స్‌కి గుడ్ న్యూస్.. సరికొత్త ఫ్లేవర్‌తో డ్రింక్..
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటించారు సీఎం చంద్రబాబు.. కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లారు.. కులవృత్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య ఇంటికి వెళ్లిన సీఎం.. కోటయ్య పశువుల పాకను పరిశీలించారు.. గేదెల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..