Botsa Satyanarayana: ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని భావించిన బీజేపీ.. ఎన్డీఏ కూటమితో పాటు.. ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరిపింది.. అయితే, ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించడంతో.. ఎన్నికలు అనివార్యం అయ్యాయి.. ఇక, ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు.. రాజ్యాంగ బద్ధమైన పదవులకు నెంబర్ గేమ్ ఉండకూడదనేది వైసీపీ విధానమని స్పష్టం చేశారు బొత్స.. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం.. గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీకి జగన్ మద్దతు ఇచ్చారు.. ఇప్పుడు అదే విధంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తాం అని స్పష్టం చేశారు.. అయితే, తెలుగు అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థన పరిగణలోకి తీసుకునేది కాదని కొట్టిపారేశారు.. అలాగైతే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి దక్షిణాదికి చెందినవారు కదా? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
Read Also: Hyderabad Traffic Marshals: 100 మంది ట్రాఫిక్ మార్షల్స్.. బైక్‌లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్!
కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి ఈ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని తాము భావించినా.. ఇండియా కూటమి తన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించడంతో పోటీ అనివార్యమైందని తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్‌ను రంగంలోకి దింపుతున్నామని.. ఆయన్ను బలపరచాలని వైఎస్ జగన్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్.. పార్టీలో మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.. ఆ తర్వాత ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.. అయితే, ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో ఏడుగురు.. మొత్తం 11 మంది సభ్యుల బలం ఉన్న విషయం విదితమే..